![]() |
![]() |

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో చాలామంది కపుల్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ మధ్య లవ్, కంపాటిబిలిటీ ఎంత రేంజ్ లో ఉందో తెలుసుకోవడానికి లవ్ గురు వాళ్లకు టెస్టులు పెడుతూ ఉంటారు. ఈ రోజు అలాంటి ఒక పేమ, నమ్మకం, ట్రస్ట్ గురించి అడగడంతో నటరాజ్ మాస్టర్ ఓపెన్ అయ్యాడు. "పెళ్ళికి ముందు ఎన్ని చేసినా పెళ్లయ్యాక ఎన్నో విషయాలు ఆకర్షిస్తూ ఉంటాయి. ఆడవాళ్ళకు కంట్రోలింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది కానీ మగవాళ్లకు అది ఉండదు. అది కొంతమందికి అందరినీ అనట్లేదు. అప్పుడు ఆ విషయాలకు అట్ట్రాక్ట్ ఐపొతూ ఉంటాం మనం. నేను కూడా అలానే ఆ మిస్టేక్ చేసాను. నేను అప్పట్లో చాలా స్ట్రాంగ్ గా ఉండేవాడిని చాలా ఆటిట్యూడ్ తో ఉండేవాడిని. ఏమన్నా కొంచెం గట్టిగా మాట్లాడినా నీతూ భయపడిపోయేది. నేను చేసిన ఒక తప్పు వల్ల ఆమె ఒక భద్రకాళిలా మారింది. దాంతో నేను ఒక్కసారి సైలెంట్ ఐపోయాను. ట్రస్ట్ ఉండే చోటే ప్రేమ ఉంటుంది అంటారు కానీ ప్రేమ ఉన్న చోటే ట్రస్ట్ ఉండాలి, ఉంచుకోవాలి. నీతూ ఒక్క క్షణం ఆవేశంగా ఆలోచించి ఉంటే నాకు మీడియాలో ఒక బాడ్ నేమ్ వచ్చేది. అలా కోపంలో ఆవేశంలో తీసుకునే నిర్ణయం మన జీవితాన్ని నాశనం చేసేసేది. అప్పుడు నీతూ నా వెనక నిలబడి నన్ను సరిదిద్దుకుంది.

ఐతే ఆ సమయంలో నీతూ చాలా ఇబ్బందిపడింది. మేము ఫైవ్ ఫ్లోర్స్ ఉన్న ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేవాళ్ళం. అర్ధరాత్రి ఒంటి గంటకు కత్తి పట్టుకుని పైకి వెళ్లిపోయేది. నేను కూడా ఆమె వెనకాలే వెళ్ళేవాడిని. అలా మూడు నెలలు ఎం పని చేయకుండా ఆమె వెనకాలే ఉన్నా. ఆ టైములో నేను అవును మగాడిని ఎంత తప్పయినా చేస్తాను అని డిసైడ్ అయ్యి వెళ్ళిపోయి ఉంటే ప్రేమను పక్కన పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటే నన్ను నమ్మి వచ్చిన ఆమెకు ఏమయ్యేది. నేను బాత్ రూమ్ కి వెళ్లినా సరే డోర్ ఓపెన్ చేసుకుని వెళ్ళేవాడిని. మూడు నెలలు ఎవరికీ తెలీదు ఈ విషయం. ఆమెకు, నాకు నిద్రలే లేవు. నమ్ముతారో లేదో బయట నుంచి ఫుడ్ తెప్పించుకుని తిన్నాం. ఆ నమ్మకాన్ని తెచ్చుకోవడానికి మూడు నెలలు పట్టింది. నా మొబైల్ ఎప్పుడూ లాక్ లో ఉండేది. అప్పుడు ఆమె నమ్మకాన్ని పోగొట్టుకున్నా కాబట్టి ఆ తరువాత నా మొబైల్ కి ఏ లాక్ లేకుండా అలా పడేసా. ఈ మూడు నెలలు ఆమెతోనే ఉన్నా. గుమ్మం దాటి కాలు బయట కూడా పెట్టలేదు. ఆమె దగ్గర నమ్మకాన్ని సంపాదించడానికి ఏడాది పట్టింది. ఇప్పటికి 15 ఏళ్ళు అయ్యింది. ఒక పాప. హ్యాపీ లైఫ్ ఇప్పుడు మాది. "అని చెప్పాడు నటరాజ్.
![]() |
![]() |